Share News

ఒకే రోజు ఏఐబీఈ, ఎస్‌ఐ పరీక్షలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:30 AM

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో వచ్చే నెల 29న ఆల్‌ ఇండియా బార్‌ ఎక్జామ్‌ (ఏఐబీఈ), తెలంగాణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్ష నిర్వహిస్తుండడంతో ఆ రోజు ఏదో ఒక పరీక్షను వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిరుద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకే రోజు ఏఐబీఈ, ఎస్‌ఐ పరీక్షలు
aibe

  • ఎస్‌ఐ పరీక్ష తేదీలు మార్చాలని నిరుద్యోగుల వినతి

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో వచ్చే నెల 29న ఆల్‌ ఇండియా బార్‌ ఎక్జామ్‌ (ఏఐబీఈ), తెలంగాణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్ష నిర్వహిస్తుండడంతో ఆ రోజు ఏదో ఒక పరీక్షను వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిరుద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పరీక్షల కోసం అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారంతా ఇప్పటికే సంసిద్ధులయ్యారని నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ తరుణంలో ఎస్‌ఐ రాత పరీక్ష తేదీని సవరించాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డును, ప్రభుత్వాన్ని వారు అభ్యర్థిస్తున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 06:25 AM