సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:35 PM
మంచిర్యాల నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. గురువారం కార్పొరేషన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
- మేయర్ ధర్ని మధూకర్
- నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం
మంచిర్యాలక్రైమ్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. గురువారం కార్పొరేషన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదించామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు. సమష్టిగా పనిచేసినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. డివిజనలోని సమస్యలను తెలుసుకొని వాటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన దొంత అంజలి
లక్షెట్టిపేట: ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరు మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం అధికారులు ముందుకు సాగాలని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్‌పర్సన దొంత అంజలినర్సయ్య సూచించారు. గురువారం లక్షెట్టిపేట పురపాలక సంఘ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ కౌన్సిలర్ రోజు వారి వార్డుల్లో తిరుగుతూ ప్రజాసమస్యలను తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ఊత్కూర్ చౌరస్తాలో ఉన్న వార సంత రోడ్డుకు ఆనుకుని ఉందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దాన్ని కాస్త వెనక్కి జరిపేందుకు అక్కడి కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో కరీంనగర్ చౌరస్తాలోని ఉన్నటువంటి మేకల మండిలకు వేలంపాటు నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు లక్షెట్టిపేట పట్టణంలో చేపట్టబోతున్న రోడ్డు విస్తరణ పనులకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేశారని, పనుల్లో వేగం పెంచాలని రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. ఇటిక్యాలలో రోడ్డు విస్తరణ పనులపై 3వ వార్డు కౌన్సిలర్ పెట్టెం తిరుపతి చైర్‌పర్సనకు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఊత్కూర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు 80ఫీట్ల రోడ్డు పనులు చేపడ్డటంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని దాన్ని 70ఫీట్లకు కుందించాలని 14వ వార్డు కౌన్సిలర్ మైలారపు సుధాకర్ సమావేశంలో చైర్మన దృషికి తీసుకుపోయారు. పట్ణణంలో చేపట్టనున్న పనులపై మున్సిపల్ మేనేజర్ ఎజెండాను వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, మున్సిపల్ మేనేజర్ కల్లెడ రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన మోత్కూరి రాజేశ్వరి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.