ప్రాణహిత ప్రాజెక్టుకు ముందడుగు పడేనా?
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:36 PM
ప్రాణహిత ప్రాజెక్టుపై గతంలో నుంచి నీలినీడ లు అలుముకోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందో లేదో అన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజలలో వ్యక్తమవుతున్నాయి.
- 2008 నుంచి దోబుచులాట
- డీపీఆర్ కోసం సర్వే ప్రారంభం
కౌటాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత ప్రాజెక్టుపై గతంలో నుంచి నీలినీడ లు అలుముకోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందో లేదో అన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాప న చేయగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించారు. రూ.37 వేల కోట్లతో 152 మీట ర్ల ఎత్తుతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారం భించి దాదాపు 50 కిలోమీటర్ల వరకు కాలువల నిర్మాణం కూడా చేపట్టారు. తరువాత తెలంగా ణ రాష్ట్రం ఏర్పడడం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడంతో ప్రాణహిత ప్రాజెక్టు మరుగున పడింది. ఆ తరువాత వార్దా నదిపై 148 మీటర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం చెప్పింది. అప్పటి మంత్రి ఇంద్రకర ణ్‌రెడ్డి గూడెం వార్దా నదిని కూడా పరిశీలిం చారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి రావడం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపడ తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేయడంతో మళ్లీ ప్రాణహిత ప్రాజెక్టుపై ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ కోసం ఆర్‌వీ అసోసియేట్ అనే సంస్థ టెండర్లు దక్కించుకొని సర్వే పనులు ప్రారంభించింది. తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది సమీపం నుంచి సుందిళ్ల వర కు ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం కాలువ పనుల తో సహా ఇతర పనులకు సంబంధించిన డ్రోన్ ద్వారా సర్వే చేస్తున్నారు.
- 1.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యం..
రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన స్థలంలోనే మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లుగా సుందిళ్ల వరకు కాలువలు నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 50 శాతం కా లువలను పూర్తవడంతో మరింత సులువుగా పనులు సాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రూ.8000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి కాలువలు పంప్‌హౌస్ నిర్మాణం అటవీశాఖ అనుమతి టీఎంసీల నీటి వినియోగం అందు బాటులోకి తీసు కొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు లకు 1,50,000 ఎకరాలకు సాగును అందించే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుం దిళ్ల, కౌటాల మండలంలోని కనికి చెరువు, పీపీ రావు ప్రాజెక్టు అచ్చలాపూర్ దగ్గర నీటిని నిలు వచేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారని అధి కారులు వివరి స్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్‌వీ అసోసియేట్స్ సంస్థ ప్రతినిధి కాగజ్‌నగర్ ఇరిగేష న్ శాఖ డీఈ వెంకటరమణతో కలిసి డీపీఆర్ తయారి కోసం సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పను ల పూర్తి చేస్తే రైతుల అవస్థలు తీరనున్నాయి.