Share News

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:16 PM

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాన్ని అందజేస్తున్న కలెక్టర్‌ హరిత

- కలెక్టర్‌ కె హరిత

కాగజ్‌నగర్‌, జూన్‌ 10 (ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోని 27వ వార్డులో ప్రజాపాల న-ప్రగతిప్రణాళిక కార్యక్రమం లో కలెక్టర్‌ మాట్లాడారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచ డంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలన్నా రు. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వర్షాకాలం ఉన్న నేపథ్యంలో ముందస్తు పారిశుధ్య చర్యలపై దృష్టి సారించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీఒక్కరు మొక్కలను సూచించారుు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షాహిన్‌ సుల్తాన, కమిషనర్‌ తిరుపతి, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం ఇందరిమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

పాఠశాల భవనానికి మరమ్మతులు..

పది సంవత్సరాలుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాల భవనానికి మరమ్మతులు చేసి మౌలిక వసతులు కల్పించి తిరిగి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు పరిశీలించాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు. బుధవారం పట్టణంలోని 13వ వార్డులోని కాపువాడ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:16 PM