పేదల భూములను లాక్కుంటే సహించేది లేదు
ABN , Publish Date - May 11 , 2026 | 11:35 PM
టైగర్ కారి డార్ పేరుతో అటవీ శాఖాధికారులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
చింతలమానేపల్లి, మే 11(ఆంధ్రజ్యోతి): టైగర్ కారి డార్ పేరుతో అటవీ శాఖాధికారులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి, దిందా, కేతిని, బెజ్జూరు తదితర గ్రామాల్లో పర్యటించి అటవీ అధికా రుల వేధింపులకు గురవుతున్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ధ్వంసం చేయడం దుర్మార్గమని మం డిపడ్డారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అన్యాయం చేస్తూ వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం అప్రజాస్వామికమన్నారు. కొండా సురేఖ అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత మహిళల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు. ఉన్న తాధికారులు ఒక మాట చెబుతూ క్షేత్రస్థాయిలో మరోలా ప్రవర్తిస్తున్నారని, పేదల భూములను లాక్కుని వారిని మళ్లీ అడ్డా కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తు న్నారని ధ్వజమెత్తారు. ఏడు పులుల కోసం ఏడు లక్షల మందిని ఆకలితో చంపడం ఏ రకమైక పాలన అని ఆయన ప్రశ్నించారు. స్థానిక నాయకులు పేదల పక్షాన నిలబడడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించా రు. ఆయన వెంట నాయకులు సత్యనారాయణ, లాంచు తదితరులు ఉన్నారు.
ఎంపీ బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయాలి
కాగజ్‌నగర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై లుక్ అవుట్ నో టీసులు జారీ చేయాలని, ఎంపీ బండి సంజయ్‌ని వెం టనే భర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేసి మూడురోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్టు చేయటం లేదని నిలదీశారు. కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్ ఎసీపీలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండు చేయాలని డిమాండు చేశారు. కాంగ్రెస్ మంత్రులు, మహిళ నాయకురాల్లు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో మహిళ కన్వీనర్ లలిత, సిర్పూరు మాజీ ఎంపీపీ మాలతీ, మహిళ నాయకురాలు వరలక్ష్మి, కవిత పాల్గొన్నారు.