అడవుల రక్షణకు పాటుపడాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:56 PM
అడవుల రక్షణకు ప్రతీఒక్కరు పాటుప డాలని బెజ్జూరు సెక్షన్ అధికారి సాఫి యాబేగం సూచించారు. సోమవారం మండలంలోని పాపన్నపేట గ్రామంలో అడవుల సంరక్షణపై అవగాహన కల్పిం చారు.
బెజ్జూరు సెక్షన్ అధికారి సాఫియాబేగం
బెజ్జూరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): అడవుల రక్షణకు ప్రతీఒక్కరు పాటుప డాలని బెజ్జూరు సెక్షన్ అధికారి సాఫి యాబేగం సూచించారు. సోమవారం మండలంలోని పాపన్నపేట గ్రామంలో అడవుల సంరక్షణపై అవగాహన కల్పిం చారు. పర్యావరణ సమతుల్యతను కాపా టంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయ న్నారు. అడవుల నరికివేత, వన్యప్రాణు లకు హాని తలపెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెట్లు భవిష్యత్‌తరాలకు ఉపయోగపడుత య ని ప్రతీఒక్కరు మొక్కలను నాటి సంర క్షించాలని సూచించారు. కార్యక్రమంలో బీట్ అధికారులు గోపాల్, స్రవంతి తదిత రులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కాగజ్‌నగర్ పట్ట ణంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పో టీలు సోమవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో అనిల్ మాట్లాడు తూ వన్యప్రాణులను రక్షిం చేందుకు అందరు తమవం తుగా కృషిచేయాలని తెలిపా రు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అధికారులు హేమలత, రవికు మార్ పాల్గొన్నారు.
సిర్పూర్(టి): ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పరస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో ప్రవీణ్‌కు మార్ సూచన మేరకు మండల కేంద్రం లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అటవీ సంపద ను, వన్యప్రాణులను కాపాడడంలో తమ వంత పాత్ర పోషించి, భవిష్యత్ తరా లకు విలువైన ప్రకృతి సంపదను అంద జేస్తామని విద్యార్థులు తెలిపారు. కార్య క్రమంలో సెక్షన్ ఆఫీసర్ వందన, బీట్ ఆఫీసర్ హబీబా, వాచర్లు తదితరులు పాల్గొన్నారు.