‘పది’లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేయాలి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:28 PM
పదో తరగతి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అధికారులకు సూచించారు.
- అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి
ఆసిఫాబాద్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టరేట్ సమావేశ మందిరం లో విద్యాశాఖాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఈడ బ్ల్యూఐడీసీ ఏఈలు, కేజీబీవీ ఎస్‌వోలతో విద్యా ప్రమాణా లు, వసతలకల్పన, ఇతర అంశాలపై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ తివారి మాట్లాడుతూ కేజీబీవీలో విద్యార్థులకు అవసరమైన సదుపా యాలు కల్పించాలని, విద్యాప్రమాణాలు పాటించాలని తెలిపారు. కేజీబీవీలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచే యాలన్నారు. వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధనదిశ గా కృషిచేయాలని, పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ పనులను, మరమ్మతు పనులను వేగవంతం చేయా లన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.
తరగతిలో వెనబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని, అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల సందర్శన..
బెజ్జూరు: బెజ్జూరు మండలం మర్తిడి గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలను సోమవారం అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి సందర్శించారు. ఆయా పాఠశాలలో ఏడు తరగతులు కొనసాగుతుండగా పదవ తరగతి ఉన్నతీ కరణ కోసం యజమాన్యం దరఖాస్తు చేసుకోగా ఈ సందర్భంగా పాఠశాలను తనిఖీ చేశారు. ఎంఈవో సునీత, ప్రధానోపాధ్యాయుడు డేవిడ్, సర్పంచ్ మల్లేష్, ఏపీవో రాజన్న, సీఆర్‌పీలు శ్రీనివా స్, శ్రీవాణి పాల్గొన్నారు.
కౌటాల: కౌటాల మండలంలోని శ్యామ్‌మోడల్ పాఠశా లలోని వసతులను, రికార్డులను అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి పరిశీలించారు. మండలంలోని బోదం పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి వసతులను, విద్యబోధన సామర్థ్యాలను, తరగతి గది, విద్యాబోదనను, విద్యార్థులను అడిగారు. ఎంపీడీవో ప్రసాద్, ఎంఈవో హనుమంతు, కార్యదర్శి సాయికుమార్ ఉన్నారు.