Share News

ముడి సరుకును కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:33 PM

ఎస్పీఎం మిల్లు ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకును తాము కొనుగోలు చేస్తామని ఎస్పీఎం యూనిట్‌ హెడ్‌ ఎ.కె.మిశ్రా తెలిపారు.

ముడి సరుకును కొనుగోలు చేస్తాం
ముడిసరుకు దిగుబడి చెక్‌లను అందజేస్తున్న ఎస్పీఎం యూనిట్‌ హెడ్‌ ఏకే మిశ్రా

-ఎస్పీఎం యూనిట్‌ హెడ్‌ ఏకే మిశ్రా

కాగజ్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎస్పీఎం మిల్లు ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకును తాము కొనుగోలు చేస్తామని ఎస్పీఎం యూనిట్‌ హెడ్‌ ఎ.కె.మిశ్రా తెలిపారు. బుధవారం స్థానిక హెచ్‌ఆర్‌డీ హాలులో ముడిసరుకు పండించిన రైతులకు చెక్‌ల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంజరు భూముల్లో నీలగిరి సాగు చేసేందుకు ఎంతగాయో ఉపయోగపడుతుందన్నారు. ఇందుకు అన్నీ సూచనలు, సలహాలు తమ సిబ్బంది వివరిస్తారన్నారు. పంట దిగుబడి తప్పకుండా తామే కొనుగోలు చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అలాగే సుబాబుల్‌, సవరి తోటలు కూడా పెంచవచ్చన్నారు. వీటికి కూడా తక్కువ పెట్టుబడి ఉంటుదన్నారు. తక్కువ నీటి అవసరం, భూసార రక్షణ, స్థిరమైన ఆదాయం, తక్కువ శ్రమ ఉంటుందన్నారు. పండించిన ముడిసరుకును తాము కొనుగోలు చేస్తామన్నారు. ప్లాంటేషన్‌ జీఎం నర్కహడే, కమర్షియల్‌ జనరల్‌ మేనేజర్‌ అనిల్‌, ప్లాంటేషన్‌ మేనేజర్‌ సంతోష్‌ నీలగిరి పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అనంత రం వివిద పంటలు సాగు చేసిన దిగుబడి తెచ్చిన వారికి చెక్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:34 PM