మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:23 PM
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య సూచించారు. ఆదివారం పట్టణంలో బీఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య సూచించారు. ఆదివారం పట్టణంలో బీఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 34 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నవారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర పడిందన్నారు. గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్ పార్టీ సముచిత స్థానాలు దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డు ల్లో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చే యాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సత్యనా రాయణ, బత్తుల సుదర్శన్, బడికెల శ్రావణ్, సబ్బని అరుణ్ తదితరులు పాల్గొన్నారు.