Share News

న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలి

ABN , Publish Date - May 12 , 2026 | 10:26 PM

బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. నస్పూర్‌ పోలీస్‌స్టేషనను మంగళవారం డీసీపీ భాస్కర్‌ సందర్శించారు.

న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలి
నస్పూర్‌ పోలీస్‌ స్టేషనలో కేసుల వివరాలు తెలుసుకుంటున్న డీసీపీ భాస్కర్‌

- డీసీపీ భాస్కర్‌

నస్పూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. నస్పూర్‌ పోలీస్‌స్టేషనను మంగళవారం డీసీపీ భాస్కర్‌ సందర్శించారు. రిసెప్షన, సీసీటీఎనఎస్‌ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన నిర్వహణ రికార్డులు రౌడీషీటర్ల, అనుమానితుల వివరాలు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల, రికార్డుల పరిశీలించారు. స్టేషన పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్టేషనపరిఽధిలో పెట్రోలింగ్‌, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ విజిబుల్‌ పోలీసింగ్‌ చేట్టాలన్నారు. ప్రతి కానిస్టేబుల్‌కు కేటాయించిన కాలనీలు, గ్రామాలను సందర్శించి శాంతిభద్రత గురించి తెలుసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలపాలపై నిరంతరం నిఘాను పెట్టాలని ఆదేశించారు. విద్యాలయాల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌, ఎస్సై ప్రశాంత పాల్గొన్నారు.

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

బెల్లంపల్లి: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వనటౌన ఎస్‌హెచవో శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి రవాణకు నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా గంజాయి రవాణ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను పోలీసు స్టేషనకు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించామన్నారు. అనంతరం నార్కోటిక్‌ పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని వైద్యులు పరీక్షలు నిర్వహించి నలుగురి వ్యక్తులకు పాజిటీవ్‌ వచ్చిందని తెలిపారు. పాజిటీవ్‌ వచ్చిన వారిలో జమీర్‌, తాజ్‌బాబా, ఖలీం, మనుదీప్‌లు ఉన్నారని వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డీ అడిక్షన సెంటర్‌కు తరలించామని పేర్కొన్నారు.

Updated Date - May 12 , 2026 | 10:26 PM