ఓటర్లు వివరాలను సరిచూసుకోండి
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:11 PM
ఓటర్లు తమ వివ రాలను సరిచూసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు.
- జిల్లాలో సర్ ప్రక్రియ ప్రారంభం
- ఓటర్ల జాబితా దరఖాస్తుల పంపిణీ
నస్పూర్, జూన 25 (ఆంధ్రజ్యోతి): ఓటర్లు తమ వివ రాలను సరిచూసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గురువారం ప్రారంభం అయింది. ఇందులో భాగంగా నస్పూర్ 32వ డివిజనలోని అల్లూరి సీతరామరాజు నగర్‌లో మేయర్ ధర్ని మధుకర్ దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కుకు సంబంధిం చిన పత్రాలను నింపి బీఎల్‌వోకు ఇవ్వాలని మేయర్ సూచించారు. 26వ డివిజనలోని సుందరయ్యకాలనీలో తహసీల్దార్ సంతోష్‌కుమార్ దరఖాస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటి సర్వేప్రక్రియ వచ్చేనెల 24వతేది వరకు కొనసాగు తుందన్నారు. సవరణ కార్యక్రమంలో భాగంగా బూత స్థాయి అధికారులు ప్రతి ఇంటింటికి కనీసం మూడు పర్యాయాలు సందర్శిస్తారని తెలిపారు.
శ్రీరాంపూర్: ఓటర్లు తమ వివరాలు సరి చూసుకోవాలని నస్పూర్ తహసీల్దార్ సంతోష్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో గురు వారం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటరుసర్వే నిర్వహిస్తుండగా, శ్రీరాం పూర్‌లోని 4వడివిజన్‌లో సర్వేను ప్రారం భించారు. 84, 85, 86 బూత్‌లలో ఓటర్లను కలిసి పత్రాలు అందించారు. ముఖ్య అతి థిగా నస్పూర్ తహసీల్దార్ హాజరై మాట్లా డారు. నెలరోజుల పాటు ఇంటింటి సర్వే కొనసాగు తుందన్నారు. ఓటర్లకు అందించే పత్రాల్లో ఆధార్‌కార్డులోని వివరాలతో ఓట రు కార్డులోని తమ వివరాలను సరిచూసు కోవాలన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు నింపడంలో ఏవైనా అనుమానాలున్నా, బీఎల్‌వో మీ ఇంటికి రాకపోయినా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1950కి డయల్ చేయాలని సూచించారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చుకోవాలంటే ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో, ఫోన్‌నంబర్, ఓటరు కార్డు నంబర్ ఉపయోగించి లా గిన్ కావచ్చని సూచించారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చందర్, వార్డ్‌ఆఫీసర్ నాగార్జున, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: సర్ ప్రక్రియను బూతస్థాయిలో పకడ్బం దీగా నిర్వహించాలని తహసీల్దార్ కృష్ణ సూచించారు. గురువారం పట్టణంలో సర్ ప్రక్రియను ప్రారంభించి పట్టణంలో 51 బూత ఏరియాలో ఇంటింటికి వెళ్లి బీఎల్ వోకు ఎన్యూమరేషన ఫారంను అందించారు. కార్య క్రమంలో బీఎల్‌వోలు తిరుపతి, ఇంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: పట్టణంలో ప్రారంభమైన సర్ సర్వేను తహసీల్దార్ మల్లికార్జున పరిశీలించారు. బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీలోని 19 బూతల లో బీఎల్‌వోలు సర్ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలం దరు సహకరించాలని కోరారు. ఏమైనా సందేహాలుంటే బీఎల్‌వోలను అడగాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మోతిరామ్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని పోలిం గ్ బూతలలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వా మ్యానికి మూల స్తంభం అని అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పి పోకుండా కాంగ్రెస్ పార్టీ బూత స్థాయి నాయకులు, బీఎల్‌ఏలు ప్రత్యేకశ్రద్ధతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దండేపల్లి: ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వేను పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్ రోహిత దేశపాండే బీఎల్‌వోలకు సూచించారు. గురువా రం దండేపల్లిలో 49 పోలింగ్ కేంద్రంలో బీఎల్‌వోలకు ఎన్యూమరేషన ఫారాలను పంపిణీ చేయగా, 43, 44, 42, 46 పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ సందర్శించారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఫారాల ప్రక్రియను పరిశీలించా రు. ఆయన మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. మరణించిన వారి పేర్లు శాశ్వతంగా, వలస వెళ్లిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లయితే వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. ఒకేకుటుంబానికి చెందినవారి ఓట్లు అంతా ఒకే వార్డు, పోలింగ్ కేంద్రాల్లో ఉండేటట్లు బీఎల్‌వోలు చూడా లన్నారు. సర్వేలో భాగంగా ప్రతి ఓట రు పూర్తి వివరా లను తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. ఓటరు నమోదుపై అవగాహన పెంచుకొని, తప్పలు లేని, పరిపూర్ణమైన ఓటరు జాబితాను నమో దు చేయా లని బీఎల్‌వోలకు సూచించారు. సర్ సర్వేలో బీఎల్‌వోల పాత్ర కీలకమన్నారు. ఓటరు జాబితాల సవరణకు ప్రతి ఓటరు బీఎల్‌వోలకు సహకరించి పూర్తి వివరాలను అం దజేయాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.