వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ABN , Publish Date - May 24 , 2026 | 11:19 PM
వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డ్రెస్ కోడ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మండల వీవోఏ సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల లింగన్న, అధ్యక్షుడు బద్రి సత్తన్న డిమాండ్ చేశారు.
దండేపల్లి మే 24 (ఆంద్రజ్యోతి): వీవోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, డ్రెస్ కోడ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మండల వీవోఏ సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల లింగన్న, అధ్యక్షుడు బద్రి సత్తన్న డిమాండ్ చేశారు. దండేపల్లిలో మండల వీవోఏల సమస్యలను పరిష్కారం కోసం నిరవదిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆదివారం దీక్ష శిబిరంలో వీవోఏలు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ వీవోఏలకు కనీస వేతనం నెలకు రూ 20వేలు చెల్లించాలని, ఉద్యోగ భఽద్రత కల్పించాలన్నారు. అర్హులైన వీవోఏలను సీసీలు గా పదోన్నతి కల్పించాలన్నారు. జీవో 58ను ప్రభుత్వం సవరించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలన్నారు. వీవోఏలకు సాదారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మంగ, ఉపాధ్యక్షుడు ముత్యం శ్రీనివాస్, సలహాదారులు అనంతలక్ష్మి, భూలక్ష్మి, వివిధ గ్రామాల వీవోఏలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
వీవోఏల సమ్మెకు సర్పంచుల మద్దతు
బెల్లంపల్లి: సమస్యలను పరిష్కరించాలని మండల వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆదివారం సర్పంచులు మద్దతు తెలిపారు. సమ్మె వద్దకు బుచ్చయ్యపల్లి, మాలగురిజాల సర్పంచులు జాడి మహేష్, శ్యామలతశ్రీకాంత్ వచ్చి సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం వీవోఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. వీవోఏల సంఘం మండల గౌరవాధ్యక్షుడు పోచం, అధ్యక్షురాలు కవిత, వీవోఏలు పాల్గొన్నారు.