మున్సిపల్ అధికారుల తీరుపై బాధితుల ఆగ్రహం
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:37 PM
మున్సిపల్ అధికారుల తీరుపై పట్టణ వ్యాపా రులు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు జారీచేయకుండా ఇంటి నిర్మాణాలను, షెడ్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
-నోటీసులు ఇవ్వకుండా గృహాలను ఎలా తొలగిస్తారు
-రహదారి విస్తరణ పనులను అడ్డుకున్న వ్యాపారులు
చెన్నూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ అధికారుల తీరుపై పట్టణ వ్యాపా రులు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు జారీచేయకుండా ఇంటి నిర్మాణాలను, షెడ్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. బాధితులు రహదారి విస్తరణ పనులను అడ్డుకోవడంతో పాతబస్టాండ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు చేరుకుని గుమిగూ డిన వారిని చెదరగొట్టారు. బుధవారం మున్సి పల్ అధికారులు పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుంచి కోటపల్లి బస్టాప్ వరకు రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఎక్స్‌కావేటర్ సహాయంతో ముందస్తు గా రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీలను కూలగొటా ్టరు. ఈ క్రమంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని ఓ ఫ్రూట్ షాపు వద్ద డ్రైనేజీతో పాటు షాపు గద్దెలను కూల్చివేయడంతో వారు మున్సిపల్ అధికారులను నిలదీస్తూ పనులను అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులు, బాధితులు గుమిగూడ డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలా కూల్చివేత పనులు చేపడతారని, నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చివేస్తారని అధికా రులను నిలదీశారు. ముందుగా నోటీసులు ఇచ్చి రహదారి సెంటర్ నుంచి ఎన్ని ఫీట్లు చేపడతారో మార్కింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే కూల్చివేతలు చేపట్టా లన్నారు. పట్టణ అభివృద్ధికి తాము కూడా సహకరిస్తాం కానీ ఇష్టం ఉన్నట్లు చేస్తే ఊరుకోమని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సీఐ బన్సీలాల్ చేరుకుని గుమిగూడిన ప్రజల ను చెదరగొట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులు డ్రైనేజీ కూల్చివేతలను చేపట్టా రు. ఈ విషయంపై మున్సి పల్ కమిషనర్ మురళీకృష్ణను సంప్రదించగా మున్సిపా లిటీ నిబంధనల ప్రకారమే రహదారి విస్తరణ చేపడు తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.