Share News

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:05 AM

జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చె

అకాల వర్షం.. నేలరాలిన మామిడి
చెన్నూర్‌ మండలం బుద్దారంలో నేలరాలిన మామిడికాయలు

- ఆందోళనలో అన్నదాతలు

చెన్నూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చెన్నూరులో బుధవారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మామిడి కాయలు నేలరాయి. సంకారం, బుద్దారం, లంబడిపల్లి, కొమ్మెర, కిష్టంపేట, లింగంపల్లి తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు నష్టపో యారు. ప్రతియేటా అకాల వర్షాలు, గాలిదుమారాలతో నష్టపోతున్నామని మామిడి రైతులు ఆందోళన చెందు తున్నారు. నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే చెన్నూరు పట్ట ణం, మండలంలో కురిసిన అకాల వర్షానికి మిర్చీ రైతులు ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంటను కాపాడు కోవడానికి మిర్చి పంటపై టార్పాలిన్లు కప్పి ఉంచారు.

నస్పూర్‌/జైపూర్‌ : నస్పూర్‌, జైపూర్‌లో బుధవారం తెల్లవారుజామున అకాలవర్షం కురిసింది. ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం కారణంగా విద్యుతకు అంతరాయం ఏర్పడింది.

బెల్లంపల్లి: పట్టణంలో బుధవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబ డింది. ఉదయం వర్షం కురవడంతో పదోతరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై నీరు చేరడంతో ద్విచక్రవాహనదారులు అవస్థలు పడ్డారు.

నెన్నెల: మరో రెండురోజులు వర్షాలు కురిసే అవ కాశం ఉందనే వాతావరణ శాఖ సూచన మామిడి రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి సీజనలో ప్రతికూల వాతావరణంతో మామిడి పూత మాడి అంతంత మాత్రంగా పిందెలు కట్టాయి. ఆ పిందెలు కాస్తా గాలివానతో రాలిపోతున్నాయని రైతులు వాపో తున్నారు. మరోవైపు కూలీల కొరతతో పత్తి సేకరణ పూర్తికాలేదు. చెట్లపై ఉన్న పత్తి వర్షానికి తడిసింది. ఇప్పటికే పత్తి సేకరణ ఆలస్యం కాగా తడిసిన పత్తి ఆరే వరకు వేచి చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:05 AM