ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి
ABN , Publish Date - May 26 , 2026 | 11:34 PM
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
- సీపీ అంబర్ కిశోర్ ఝా
బెల్లంపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. సీపీకి అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది నుంచి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీసు సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో గౌరవంగా వ్యవహరించాలన్నారు. బాధితుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించాలని ఆదేశించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఆన్‌ది స్పాట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కొన్ని రకాల నేరాల్లో బాధితులు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా సంఘటన స్థలానికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం దాదాపు 80 శాతం నుంచి 90 శాతం కేసుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదైనా ఘటనలు జరిగితే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని, వెంటనే స్పందించి బాధితులకు సేవలు అందిస్తామని చెప్పారు. భూ వివాదాల్లో పోలీసుల జోక్యం లేకుండా చట్టపరమైన విధానంలో వ్యవహరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ నిర్వహణ క్రమశిక్షణ, పరిశుభ్రత, నేరకేసుల దర్యాప్తులో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని సీపీ అభినందించారు. ఆయన వెంట డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, రూరల్ సీఐ హనోక్, ఎస్‌ఐ రామకృష్ణ ఉన్నారు.
బెల్లంపల్లి రూరల్: పట్టణాల్లో, గ్రామాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు కట్టడికి కట్టుదిట్టమైన ప్రణాళికతో వ్యవహరించాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్ ఝా సూచించారు. మంగళవారం బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌ను సీపీ పరిశీలించారు. రికార్డులతో పాటు రౌడీషీటర్లు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ