ఈదురుగాలులతో కూడిన వర్షం
ABN , Publish Date - May 09 , 2026 | 11:48 PM
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఆసిఫాబాద్, మే 9(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అ య్యారు. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు వేడిమి, ఉక్క పోత నుంచి ఉపశమనం పొందారు. ఈదురుగాలుల బీభత్సానికి ఆసిఫాబాద్ మండలం అడదస్నాపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. కొత్త దెమ్మడి గూడ గ్రామంలో ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
దహెగాం/కెరమెరి:తి దహెగాం, కెర మెరి మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో మండ లంలోని దహెగాం, లగ్గాం, కుంచవెల్లితో పాటు తదితర వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని రైతలు కోరుతున్నారు.
సిర్పూర్(టి): మండల కేంద్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలో వార సంత ఉండడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బం దులు పడ్డారు. చిరువ్యాపారుల దుకాణా లు అతలాకుతలమయ్యాయి. గంట పాటు వర్షం కురియడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.