యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:00 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు.
- మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
హాజీపూర్, జూన 24 (ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. మాదక ద్రవ్యాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా బుధవారం గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, రూరల్ సీఐ రవీందర్ అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని , చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కిరణ్‌కుమార్, ఎక్సైజ్ డీఎస్‌పీ రామ్‌రెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ రవూఫ్, కాలేజీ ప్రిన్సిపల్ జగతిదేవి, పోలీసులు, అధ్యాపకులు, , విద్యార్థులు పాల్గొన్నారు.
వేమనపల్లి: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం వేమనపల్లిలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీల్వాయి ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ప్రతీఒక్కరు ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రమశిక్షణతో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. గంజాయి, ఇతర మత్దు పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.