Share News

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:48 PM

ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రాపల్లి గ్రామసభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

హాజీపూర్‌, జూన 4 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈసారి వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో తదనుగుణంగా సాగు చేయగల పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆ దిశగా వ్యవసాయ, విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, ప్రభుత్వం ధ్రువీకరించిన విత్తనాలనే వాడాలన్నారు. జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వైద్యం, విద్య, మహిళ రక్షణ, ప్రభుత్వ పథకాల అమలు అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయివెంకట్‌రెడ్డి, ఎంఈవో తిరుపతి, సర్పంచు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు: మండలంలోని అక్కెపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. అక్కెపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ్ల అదనపు కలెక్టర్‌ చంద్రయ్య హాజరై మాట్లాడారు. ఓటరు లిస్టు రివిజన గురించి తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కానున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వన సంరక్షణ, వ్యవసాయ పంట వైవీధ్యకరణ గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ కల్పన, డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో మోహన, ఎంపీవో అజ్మత ఆలీ, ఏఎస్‌ఐ మాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 10:48 PM