యువత హక్కుల కోసం పోరాటం
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:38 PM
దేశ యువత భవిష్యత్‌తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడు తోందని యువత హక్కుల కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగు ణ అన్నారు.
- డీసీసీ అధ్యక్షురాలు సుగుణ
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): దేశ యువత భవిష్యత్‌తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడు తోందని యువత హక్కుల కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగు ణ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆమె మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామకాలలో జాప్యాల కారణంగా లక్షలా ది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గుర వుతున్నారని అన్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిం చే పలు పోటీపరీక్షల్లో తరచూ అవకతవకలు చోటు చేసుకో వడంతో యువతలో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. ప్రతిఏ డాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజే పీ ప్రభుత్వం హామీని అమలు చేయడంలో విఫలమైంద న్నా రు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, డీసీసీ ఉపాధ్య క్షుడు భీంరావు, కార్యదర్శి శంకర్, డైరెక్టర్లు జక్కన్న, కౌన్సిలర్లు కార్తీక్, రాజేందర్, రాము, నారాయణ, మమమూద్, కాసయ్య, హరి కృష్ణ, భానుచందర్, చరణ్, ఉపసర్పంచ్ విలాస్ పాల్గొన్నారు.