వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:41 PM
ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన వడ్డీ లేని రు ణాల పథకంలో పట్టణ మ హిళా సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉపముఖ్య మంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
ఆసిఫాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన వడ్డీ లేని రు ణాల పథకంలో పట్టణ మ హిళా సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉపముఖ్య మంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మం త్రి దనసరి అనసూయ(సీతక్క), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ ముఖ్య కార్యనిర్వ హణ అధికారి దివ్యదేవరాజన్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవితో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇంది రమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్య మంత్రి మాట్లాడుతూ పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అర్హులై న స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిర మ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించి పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదా యంలోని వీసీ హాల్ నుంచి కలెక్టర్ కె హరిత, అద నపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలను పకడ్బందీగా అందజేస్తామని తెలి పారు. సమావేశంలో లీడ్ డిస్టిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, మున్సిపల్ కమిషనర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకు న్న కలెక్టర్ కె హరితకు అదనపు కలెక్టర్, అధికారు లు, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.