Share News

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:09 PM

విద్యుత్‌ సంస్థలోని ఆర్టిజన్‌ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్‌, పవన్‌ డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
దీక్షా శిబిరంలో కూర్చున్న కార్మికులు

మంచిర్యాలక్రైం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సంస్థలోని ఆర్టిజన్‌ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్‌, పవన్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్‌ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. పాత మంచిర్యాలలోని 132కేవీ సబ్‌ స్టేషన్‌ వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. విద్యుత్‌ సంస్థలో ఆర్టీజన్‌లుగా పనిచేస్తున్నవారి విద్యార్హతలను బట్టి వారికి కన్వెర్షన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ప్రత్యేక పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కన్వెర్షన్‌ ఇవ్వాలని , ఏపీఎస్‌ఈవీ రూల్స్‌ ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను ఆర్టీజన్‌లుగా విభజించారని, దీని వల్ల ఆర్టిజన్‌లు చాలా వరకు నష్టపోతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల, లక్షెట్టిపేట, మందమర్రి, చెన్నూరు, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, చెన్నూరు సబ్‌స్టేషన్ల ఆర్టిజన్‌లు పాల్గొన్నారు.

- ఆర్టిజన్ల సమ్మెకు మద్దతు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఆర్టిజన్లు పాత మంచిర్యాలలో చేస్తున్న సమ్మె శిబిరాన్ని బుధవా రం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ సందర్శించి మద్ద తు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రంజిత్‌కుమార్‌, రవి, వెంకటస్వామి, దేవదాసు, లక్ష్మణ్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 11:09 PM