Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:39 PM

రాష్ట్ర అభివృదిఽ్ధ,ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ, సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

- జిల్లాలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యం

ఆసిఫాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృదిఽ్ధ,ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ, సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.26 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను చేపడుతోందన్నారు. జిల్లాలో విద్యా, వైద్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్‌ హరిత, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజక వర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఎంసీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం...

ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఇరుకుల్ల మంగ ప్రమాణస్వీకారం చేశారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో జిల్లా మార్కెటింగ్‌ అదికారి అశ్వక్‌ అహ్మద్‌ ప్రమాణస్వీకారం చేయించా రు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ గా రవీందర్‌, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేఖ శ్యాంనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, నాయ కులు బాలేశ్వర్‌గౌడ్‌, చరణ్‌, నిజాం పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం

కాగజ్‌నగర్‌: రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాలకు సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్‌ ఇచ్‌చార్జి మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కాగజ్‌నగర్‌ 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాలనలో ఉన్న వనరులు, నిధులతోనే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, కేసీఆర్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రంపై రూ. ఎనిమిది లక్షల కోట్లకుపైగా అప్పుల భారం మోపారని విమర్శించారు. కేసీఆర్‌ చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీలు కడుతున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. ఈ పథకం విజయవంతం అయినట్టు తెలిపారు. ఇళ్లు మంజూరుకాని వారు నిరాశ చెందవద్దని ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను మహిళలకు అందజేసినట్టు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ దండే విఠల్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి 100 పడకల నూతన భవనాన్ని ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. కేజీబీవీలో నూతన భవనం పూర్తి చేయటం గర్వంగా ఉందన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లో 100 పడుకల ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్‌లను పంపిణీ చేశారు. వంద పడకల ఆసుపత్రికి స్థలం కేటాయించిన లాహోటిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దాశుక్లా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుద్దాల దేవయ్య పాల్గొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

వాంకిడి: రాష్ట్రంలో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వాంకిడి మండలంలోని బెండార గ్రామ సమీపంలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలకు, వాంకిడి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రూ. 2.30 కోట్లతో నిర్మించనున్న బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అనంతరం వాంకిడి కేజీబీవీ పాఠశాలలో రూ. 67.50 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను, ఏహెచ్‌ఎస్‌ బాళికల అశ్రమోన్నత పాఠశాలలో రూ. 60 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను రూ. 1.56 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(పీహెచ్‌సీ) భవణాన్ని, చిన్నుపాటెల్‌ గూడ గ్రామంలో రూ. 13.50 లక్షలతో నిర్మించిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జైత్‌పూర్‌ గ్రామంలో రామగిరి భారతబాయి నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నికితాపంత్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌, ఎంపీడీవో పాటిల్‌ జోత్స్న, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:39 PM