జాతరను విజయవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:26 PM
రెబ్బెన మండలంలోని గంగాపూర్ జాతర ను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ నితికాపంత్ అధికారులకు సూచిం చారు.
- ఎస్పీ నితికా పంత్
- గంగాపూర్ జాతర ఏర్పాట్ల పరిశీలన
రెబ్బెన, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలంలోని గంగాపూర్ జాతర ను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ నితికాపంత్ అధికారులకు సూచిం చారు. గంగాపూర్ గ్రామంలోని వేంకటేశ్వ రస్వామి ఆలయాన్ని ఎస్పీ నితికా పంత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రానున్న జాతర ను శాంతియుతంగా, సాఫీగా నిర్వహిం చేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి జాతరను విజయవంతంగా నిర్వహించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జాతర ను శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందు కు అవసరమైన అన్నిఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు.