Share News

ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:30 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పురుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చిన వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్‌ చేశారు.

ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పురుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చిన వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆసిఫాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ పేదలు, కూలీలు, రైతుల జీవనాధారంగా ఉన్న ఉపాధిహామీ పథకా న్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రజావ్యతిరేమని విమర్శించారు. ఉపాధిహామీ చట్టం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి లభిస్తోందన్నారు. అలాంటి చట్టాన్ని బలహీన పర్చడం అన్యాయ మన్నారు. వీబీ జీ రామ్‌జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పక్కన పెట్టి కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేయాలనే ప్రయ త్నం జరుగుతోందని విమర్శించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ మంగ, బాలేష్‌గౌడ్‌, చరణ్‌, మల్లేష్‌, శిప్రసాద్‌, నారాయణ, దత్తు, నిజాం, జక్కయ్య, సత్యనారాయణ, శ్యాం, మారుతి, ఆయా మండ లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:30 PM