Share News

ఏసీబీ వలలో ఫారెస్ట్ సెక్షన్‌ ఆఫీసర్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:42 AM

టింబర్‌ డిపో లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం తన తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపడానికి నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని ఓ టింబర్‌ డిపో నిర్వాహకుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ గురువారం ఖానాపూర్‌ రేంజ్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఐండ్ల రవీందర్‌ పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో ఫారెస్ట్  సెక్షన్‌ ఆఫీసర్‌
ravinder

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో ఘటన

ఖానాపూర్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): టింబర్‌ డిపో లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం తన తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపడానికి నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని ఓ టింబర్‌ డిపో నిర్వాహకుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ గురువారం ఖానాపూర్‌ రేంజ్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఐండ్ల రవీందర్‌ పట్టుబడ్డారు. ఉన్నతాధికారులకు ఖానాపూర్‌ టింబర్‌ డిపో లైసెన్సు పునరుద్ధరణకు తనిఖీ నివేదిక పంపడంతోపాటు, డిపోను సందర్శించినందుకు సహకరిస్తానని అందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని టింబర్‌ డిపో నిర్వాహకుడిని ఐండ్ల రవీందర్‌ డిమాండ్‌ చేశారు. సదరు టింబర్‌ డిపో నిర్వాహకుడు పదే పదే అభ్యర్థించడంతో రూ.12 వేలకు అంగీకరించాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12.53 గంటలకు సదరు డిపో నిర్వాహకుడి నుంచి రూ.12 వేల నగదును రవీందర్‌ తీసుకున్న తర్వాత అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. రవీందర్‌ కారులో ఉన్న రూ.12 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఐ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉండటంతోపాటు భద్రతా కారణాల రీత్యా తమకు ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 05:42 AM