Share News

ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టండి

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:45 PM

పరిశ్రమలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మిల్లులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖ డిప్యూటి చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ లక్ష్మీకుమారితో కలిసి మిల్లులో రక్షణ చర్యలు, తదితర ఏర్పాట్లుపై నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ను పరిశీలించారు.

ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టండి
ఎస్పీఎంలో క్లోరిన్‌ గ్యాస్‌ ప్లాంటును పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

- కలెక్టర్‌ హరిత

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మిల్లులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖ డిప్యూటి చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ లక్ష్మీకుమారితో కలిసి మిల్లులో రక్షణ చర్యలు, తదితర ఏర్పాట్లుపై నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిశ్రమలలో నిలువ ఉండే క్లోరిన్‌, యాసిడ్‌ తదితర రసాయనాల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మిల్లు జీ.ఎం ఎంఎస్‌ గిరి, సేఫ్టి మే నేజర్‌ శ్రీనివాస్‌, కమర్షియల్‌ జీ.ఎం. అనిల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

జన గణన శిక్షణ పరిశీలన

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహిస్తు న్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇళ్ల గణన కార్యక్రమాన్ని విజయవం తం చే యాలన్నారు. గణాంక అధికారి గురువయ్య, మాస్టర్‌ ట్రైనర్లు ఊషన్న, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.

ఎండలపై అప్రమత్తంగా ఉండాలి..

ఎంత తీవ్రత పట్ల ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం మండలంలోని చింతగూడ, బలగల గ్రామ శివారులో ఉపాఽధి హామీ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పనుల కూలీలు, వారి హాజ రు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:45 PM