Share News

విజయవంతంగా జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 11:28 PM

మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి టాలెంట్‌ టెస్టు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని జిల్లా విద్యాధికారి యాదయ్య తెలిపారు.

విజయవంతంగా జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌
బహుమతులు గెలుపొందిన విద్యార్థులతో డీఈవో యాదయ్య

- జిల్లా విద్యాధికారి యాదయ్య

మంచిర్యాలకైరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన జిల్లాస్థాయి టాలెంట్‌ టెస్టు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని జిల్లా విద్యాధికారి యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు వారి లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని కృషితో ముందుకుసాగాలని సూచించారు. జిల్లాలో గెలుపొందిన విద్యార్థులను వారు అభినందించారు. ప్రథమ స్థానంలో బాదంపల్లికి చెందిన కె శ్రావ్యశ్రీ, ద్వితీయ స్థానంలో కిష్టపూ ర్‌కు చెందిన ఏ. అనన్య, తృతీయ స్థాయంలో రాపల్లికి చెందిన జి. చం ద్రశేఖర్‌ నిలిచారు. ఎఫ్‌పీఎస్‌టీ జిల్లా అధ్యక్షుడు క్రిష్ణమూర్తి, కార్యదర్శి రాజన్న, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ చౌదరి, భరత్‌్‌, ఎఎస్‌ఎన్‌ మూర్తి, రాజుకుమార్‌, సైన్స్‌ అధికారి రాజాగోపాల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వేను విజయంతంగా నిర్వహించాలి

జిల్లాలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో నిర్వహించబోయే ఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్‌ఆర్‌ఆర్‌కేఎం డైట్‌ కాలేజీ విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో నిర్వహించబోయే ఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వేను నియమనిబంధనలు పాటిస్తూ సమయపాలనతో సర్వేను పూర్తి చేయాలన్నారు. ఏ సందేహాలు ఉన్న శిక్షణ కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు. సర్వే నిర్వహించే కాలంలో సందేహాలను రిసోర్స్‌పర్సన్లు, క్వాలిటీ కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారుల సహాయం పొందవచ్చునని సూచించారు. క్వాలిటీ కోఆ ర్డినేటర్‌ సత్యనారాయణమూర్తి, రిసోర్స్‌పర్సన్స్‌ బుచ్చన్న, వామన్‌కు మార్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 11:28 PM