తాగునీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థినులు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:29 PM
తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం తిర్యాణి మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కొన్ని ఏళ్ల నుంచి నీటి సమస్య ఉన్నప్పటికీ, పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు పోయినా ఎవరు పట్టించుకోక పోవడంను నిరసిస్తూ విద్యార్థినులు పాఠశాల నుంచి ఖాళీ బకెట్లతో బయటికి వచ్చి ర్యాలీగా కుమరం భీం చౌరస్తా అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
తిర్యాణి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం తిర్యాణి మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కొన్ని ఏళ్ల నుంచి నీటి సమస్య ఉన్నప్పటికీ, పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు పోయినా ఎవరు పట్టించుకోక పోవడంను నిరసిస్తూ విద్యార్థినులు పాఠశాల నుంచి ఖాళీ బకెట్లతో బయటికి వచ్చి ర్యాలీగా కుమరం భీం చౌరస్తా అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి నీటి సమస్య ఉన్నప్పటికీ, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎవరు పట్టించుకోకపోవడంతో విద్యార్థినులు ఆందోళన చేశారు. పాఠశాల నుంచి ఖాళీ బకెట్లతో బయటికి వచ్చి ర్యాలీగా కుమరం భీం చౌరస్తా అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ మిషన్ భరగీథ నీరు కూడా సక్రమంగా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. నీరు రాకపోవడంతో స్నానాలకు, ఇతర అవసరాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ విషయమై ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రిన్సిపాల్ సమయ పాలన పాటించడం లేదని ఉద్యోగరీత్యా బెల్లంపల్లి నుంచి ప్రయాణం సాగిస్తూ గురుకులంలో పిల్లల అవస్థలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు గుణవంతరావు, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, కమల, శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు విద్యార్థుల ధర్నాకు మద్దతు ప్రకటించారు.
సుమారు నాలుగు గంటల పాటు ఎండలో కూర్చని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఒక దశలో ఎండ వేడిమికి తట్టుకోలేక ముగ్గురు విద్యార్థినులు స్పృహ కోల్పోవడంతో 108 వాహనంలో తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన ఆర్సీవో సమస్య పరిష్కారించాలని డీసీవో రమ్యకృష్ణను విద్యార్థుల దగ్గరికి పంపించారు. ఆమె అక్కడికి చేరుకుని విద్యార్థిణులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేష్, ఏఈ కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.