విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:37 PM
పదో తరగతి విద్యార్థులు ఒత్తి డికి గురికాకుండా, భయపడకుండా పరీక్షలు రాయాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.
- జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు
భీమారం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు ఒత్తి డికి గురికాకుండా, భయపడకుండా పరీక్షలు రాయాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం భీమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షల ప్రాముఖ్యం, సంసిద్ధత, భయాన్ని అధిగమించే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. సమయ పాలన, ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే మంచి మార్కులు సాధించవచ్చన్నారు.
ప్రశ్నలను జాగ్రత్తగా చదివిన తర్వాతనే జవాబులు రాయాలని సూచించారు. పరీక్షల వేళ ఒత్తిడికి గురి కావద్దని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో సెల్‌ఫోన, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తల్లిదండ్రులకు తెలియజే యాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, ఇతర సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.