అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:55 PM
దేశ ప్రగతితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పార్టీ కార్యకర్తల కృషి వల్లనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చిట్టచివరి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ మాత్రమేనని, ఇతర పార్టీలు కుటుంబం, స్వలాభం కోసం పనిచేస్తున్నాయన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ పోలింగ్ బూతలో పార్టీ జెండా ఎగరాలన్నారు. ఇటీవల మంచిర్యాలకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ బీజేపీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తుంది తప్ప ముస్లింల కోసం 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు గాజుల ముకేష్‌గౌడ్, తుల ఆంజనేయులు, ఆకుల అశోక్ వర్ధన, వెంకటేశ్వర్‌గౌడ్, మురళీ, కమలాకర్‌రావు, శ్రీనివాస్, దేవేందర్, వెంకటేష్, అశోక్, తరుణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.