సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:01 PM
విద్యుత శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే కృషిచేయాలని విద్యుత శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు.
-విద్యుత శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి
చెన్నూరు, జూన 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే కృషిచేయాలని విద్యుత శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని సబ్‌స్టేషన, సబ్ స్టేషన ఆవరణలో చేపడుతున్న నూతన భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత శాఖలో ఎలాంటి సమస్యలున్నా కిందిస్థాయి అధికారులు తక్షణమే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు, తదితర అంశాలపై చర్చిచారు. విధినిర్వహణలో ప్రతీ ఒక్కరు శాఖ నియమాలు, విధివిధానాలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత సరఫరా అందించేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో వివిధ అంశాలపై చర్చించారు. నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఈ రాజన్న, డీఈ కైజర్, ఏఈ శ్రీనివాస్, విద్యుత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.