Share News

లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - May 16 , 2026 | 11:06 PM

కాగజ్‌నగర్‌ మండలంలో లోవోల్టేజీ సమస్యను తీర్చేందుకు కొత్తగా మూడు 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీ్‌ష్‌ బాబు తెలిపారు.

లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి చర్యలు
కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు

-సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు

కాగజ్‌నగర్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలంలో లోవోల్టేజీ సమస్యను తీర్చేందుకు కొత్తగా మూడు 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీ్‌ష్‌ బాబు తెలిపారు. శనివారం కాగజ్‌నగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్‌ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అంకుసాపూర్‌, బోడెపల్లి, కాగజ్‌నగర్‌ కాపువాడలో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఇందుకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధూకర్‌, ఎంపీడీవో ప్రజ్వల్‌ కుమార్‌, సర్పంచ్‌లు బికాస్‌ గరామి, వేణు యాదవ్‌, సంగీత, శ్రీనివాస్‌, రాజేందర్‌ జాదవ్‌, నాయకులు పుల్ల ఆశోక్‌, తిరుపతి, లోనారే రవీందర్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్ల నిర్మాణానికి కృషి

సిర్పూర్‌(టి): మండలంలోని అచ్చెల్లి, చింతకుంట, రుద్రారం, పెద్దబండ, కేశవపట్నం, భూపాలపట్న, తదితర గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీమురక్‌ 47మంది లబ్ధిదారు లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లో ఓల్టేజీ ఉన్న గ్రామాల కోసం 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ మంజూరు చేయిస్తానని అన్నారు. మొ దటి విడతలో మంజూ రైన ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను వేగవం తంగా పూర్తి చేసుకుని లబ్ధి పొందాలన్నారు. మండలం లో 100 ఇళ్లు ఇంకా ప్రా రంభం కాలేదన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామంలో రిజర్వు ఫారెస్టు సమస్య ఉన్నందున ప్రారంభం కావడం లేదని అటవీ శాఖ అధికా రులు స్పందించి ప్రారంభించేలా కృషి చేయా లన్నారు. ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సిద్ధమవుతుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ నాగమణి, ఎంపీడీఓ సత్యనా రాయణ, సర్పంచ్‌ రజిని, ఉపసర్పంచ్‌ ప్రశాం త్‌, ఎంఆర్‌ఐలు స్వప్న, ప్రవీణ్‌, వేణుగోపాల్‌, నాయకులు నానయ్య, శంకర్‌, శ్యాంరావు, సాయి, విలాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 11:06 PM