రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:29 PM
రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
రామకృష్ణాపూర్,జనవరి28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ప్రజల కోసం పనిచేయాలని అదే విధంగా పార్టీ గెలుపునకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీవార్డుల్లో వార్డు ఇన్‌చార్జిలతో పాటు పట్టణ అధ్యక్షులు, మండల అద్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారని, అభ్యర్థులు కష్టపడి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అద్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పట్టణ అద్యక్షుడు పల్లె రాజు, కోరుకమిటీ సభ్యులు 22వ వార్డుల మాజీ కౌన్సిలర్లు ఆశావహులు, మద్దతు దారులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
హాజీపూర్: మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యే, నాయకులు ఘనంగా సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామ న్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని వివరించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.