Share News

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం

ABN , Publish Date - May 16 , 2026 | 11:04 PM

ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా రైతులకు సుస్థిర ఆదాయం ఉంటుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. దహెగాం మండలం ఐనం గ్రామంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్‌ పంట సాగుపై రైతులకు సాగులో మెలకువలు, లాభాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

- కలెక్టర్‌ కె హరిత

దహెగాం, మే 16(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా రైతులకు సుస్థిర ఆదాయం ఉంటుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. దహెగాం మండలం ఐనం గ్రామంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్‌ పంట సాగుపై రైతులకు సాగులో మెలకువలు, లాభాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా రైతులకు సుస్థిరమైన ఆదాయం కలుగుతుందని వివరించారు. నిత్యజీవితంలో పామాయిల్‌ వాడకం ఒక భాగం అయిందన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహన్ని అందిస్తోందని రైతులకు ముందుకు రావాలని కోరారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. రైస్‌ మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్‌ ఫోన్‌ ద్వారా మిల్లర్లతో మాట్లాడి ధాన్యం వెంటనే దించుకోవాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యం చేయకుండా రైతులకు ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యావన అధికారి నదీం, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌, జిల్లా సహకార శాఖాధికారి మోహన్‌, ఏడీఏ మనోహర్‌, సర్పంచ్‌లు ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

రెడ్‌ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేయాలి

ఆసిఫాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీలో పెద్దమొత్తంలో సభ్యులను చేర్పించి సోసైటీని బలోపేతం చేయడానికి ముందుకు రావాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యత్వం, బలపేతంపై అధికారులు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలో సభ్యత్వం పొందడం ద్వారా సొసైటీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీల్లో ప్యాట్రాన్‌గా సభ్యత్వం కోసం రూ.25 వేలు, వైస్‌ ప్యాట్రాన్‌గా సభ్యత్వానికి రూ.12,500, జీవితకాలం సభ్యుల సభ్యత్వానికి రూ.1,000, సంవత్సర కాల సభ్యత్వానికి రూ.100 రుసుం కట్టి సభ్యత్వం పొందాలన్నారు. జిల్లాలో సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల యజమానులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు, మండల స్థాయి అధికారులు, ప్రముఖులతో రెడ్‌ క్రాస్‌ సొసైటీలో సభ్యత్వం చేయించాలని సూచించారు. ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవడం ద్వారా సొసైటీని బలోపేతం చేయవచ్చన్నారు. ఆదిశగా అధికారులు కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 11:04 PM