శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:22 PM
శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం గుడిపేటలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన వార్షిక క్రీడా దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, రిలే రేసులు, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడా పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందిం చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దిలీప్‌కుమా ర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాల సదనం పనుల పరిశీలన
నస్పూర్ (ఆంధ్రజ్యోతి): నస్పూర్‌లో బాల ల సంరక్షణ కొరకు మిషన్ వాత్సల్య నిధులు రూ. 1.34 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు. ప నుల పురోగతిని అధికారులను అడిగి తెలు సుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చే యాలని ఆధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు
మంచిర్యాల కలెక్టరేట్ (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలు శాంతి యుతంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్, పోలింగ్, లెక్కింపు వంటి కీలక కార్యక్రమాల సమయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయుధాలు కలిగి ఉండడం, ప్రచార వాహనాలు, ప్రచారం చేయడం, ఐదు మంది కంటే ఎక్కువ మంది కలిసి ఉండడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయ డం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారత్ నాగరిక్ సురక్ష సంహిత చట్టంతో పాటు ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు.