Share News

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఆటల పోటీలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:31 PM

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి తెలిపారు.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఆటల పోటీలు
జెండా ఊపి వాహనాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

- అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్‌ భవన సముదాయం నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు హైదరాబాద్‌లో జరుగనున్న ఆటల పోటీ లకు హాజరయ్యేందుకు వె ళ్లేందుకు వాహనాన్ని జెం డా ఊపి సోమవారం ప్రా రంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లా డుతు హైదరాబాద్‌ జరిగే ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఆటల పోటీల్లో జిల్లా నుంచి ప్రత్యే క అవసరాలు గల పిల్లలు హాజరవుతున్నారని తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పథకాలు సాధించాలని ఆయ న ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్పోర్స్‌ ఇన్‌చార్జి శాంతికు మారి, ఐఈఆర్‌పీలు సతీష్‌, సుజాత, రమణ, ప్రత్యేక విద్యావేత్త మహేష్‌, విద్యార్థులు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 11:31 PM