సమస్యల పరిష్కారం కోసమే ప్రత్యేక సభలు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:27 PM
డివిజన్లలో ప్రత్యేక సభలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారిస్తున్నమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, జూన 8 (ఆంధ్రజ్యోతి): డివిజన్లలో ప్రత్యేక సభలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారిస్తున్నమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం తీగల్ పహాడ్‌లోని ఓ ఫంక్షన హాల్‌లో మంచిర్యాల కార్పొరేషనలోని 31, 32 డివిజన్లకు సంబంధించిన సభ ఏర్పాటు చేయగా డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, మేయర్ ధర్ని మధుకర్ హాజరైయ్యారు. అబ్ధిదారులకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. వైద్యం, విద్య, మహిళా రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిఒక్కరూ ఘన వ్యర్థాల నిర్వహన సక్రమంగా చేట్టాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త, ఎలక్ర్టానిక్ వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలని సూచించారు. వీటిని నిర్వీర్యం చేయడంద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందన్నారు.
మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ శుభ్రత-ప్రతిఒక్కరి ఆరోగ్య బాధ్యత నినాదంతో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. వీధిదీపాలు, రోడ్ల మరమ్మతులు, తాగునీరు, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజాపాలనలో ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఎలాంటి అవినీతి, దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా పనులు చేపట్టామని వివరించారు.
డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను, రోడ్డు భద్రతను పాటించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్‌లను ధరించాలని, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన చేయాలని సూచించారు. సమావేశంలో కార్పొరేషన కమిషనర్ అన్వేష్, 31 డివిజన కార్పొరేటర్ సంపతరెడ్డి, తహసీల్దార్ సంతోష్‌కుమార్, హౌసింగ్ ఏఈలు ప్రశాంతి, రాణి, ఎస్సై ప్రశాంత, విద్యుత శాఖ ఏఈ రాంచందర్, డాక్టర్ ప్రియాంక, రెవెన్యూ ఆర్‌ఐ చందర్ మున్సిపల్ సిబ్బంది, డివిజన ప్రజలు పాల్గొన్నారు.