Share News

జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:38 PM

జిల్లా లో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏటీజీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీబాల దేవి అన్నారు.

జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న సోనీబాల దేవి, కలెక్టర్‌ హరిత

- ఎస్‌ఏటీజీ వైస్‌చైర్మన్‌, ఎండీ సోనీబాల దేవి

ఆసిఫాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లా లో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్‌ఏటీజీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీబాల దేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవ న సమావేశ మందిరంలో కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, జిల్లా అటవీ అధికారి బాలమణిలతో కలిసి అధికారు లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సోనీబాల దేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధి కార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో క్రీడారంగంతో పాటు మైదానాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ క్రీడా మైదానం కోసం కేటాయించిన స్థలాన్ని మైదానం అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియం అభివృద్ధి కి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలపై వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన సోనీబాల దేవికి కలెక్టర్‌ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికా రు. కార్యక్రమంలో జిల్లా క్రీడా యువజన సేవ ల శాఖ అధికారి అశ్వక్‌ అహ్మద్‌, క్రీడా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రతిపాదనలు పంపించండి...

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వం విద్యారంగం తో పాటు క్రీడారంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ఈక్రమంలో జిల్లాలో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమ ర్పించాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్‌చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీబాల దేవి అన్నారు. సోమవా రం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ లో గల క్రీడా మైదా నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. 400 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, వాలీబాల్‌, పుట్‌బాల్‌కు, క్రీడా మైదానం ప్రహ రీ, అభివృద్ధి, మరమ్మతు చర్యలకు సంబంధిం చిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

గిరిజన సంక్షేమ బాలికల క్రీడా పాఠశాలను సందర్శించి పీడీ, పీఈటీలు, శిక్షకులతో మాట్లా డారు. విద్యార్థులకు క్రీడల్లో సరైన తర్పీదు అందించాలని సూచించారు. సీఎం కప్‌ క్రీడా పోటీలలో విజేతులుగా నిలిచిన విద్యార్థులు, శిక్షణ ఇచ్చిన పీడీ, పీటీలను అభినందించారు. ఆమె వెంట జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:38 PM