Share News

సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:25 PM

సింగరేణి సంస్థకు రావాల్సిన 45 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్‌ చేశారు.

సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్‌లో మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య

శ్రీరాంపూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థకు రావాల్సిన 45 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్‌ చేశారు. సీసీసీలోని నర్సయ్య భన్‌లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రధానంంగా సొంతింటి పతకం, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను సింగరేణి చెల్లించేలా స్ట్రక్చర్‌ సమావేశంలో మాట్లాడామన్నారు. ఆయా హామీలకు యాజమాన్యం ఒప్పుకున్నట్లు చెప్పారు. మైనింగ్‌ స్టాఫ్‌, ట్రేడ్స్‌మెన్‌ మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే వారికి సర్ఫేస్‌లో సూటబుల్‌ జాబ్‌ ఇప్పించామని తెలిపారు. డిపెండెంట్ల వయస్సు పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచామని, కార్మికులకు సూపర్‌స్పెషాలిటీ సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. తాము అన్ని హామీలు నెరవేరుస్తుంటే కొన్ని సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయని, వారికి కార్మికులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈనెల 18వ తేదీన సీపీఐ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు కార్మికులు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. అనంతరం శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన యూనియన్‌ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, ఉప ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కె సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్‌, కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం బెల్లంపల్లి రీజియన్‌ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్‌, నాయకులు ప్రసాద్‌రెడ్డి, బద్రి బుచ్చయ్య, నాగభూషన్‌, అడ్డు శ్రీనివాస్‌, బాలకృష్ణ, సరోజ, అన్ని గనుల పిట్‌ కార్యదర్శులు, కమిటీల నాయకులు పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బాధ్యతాయుతంగా గుర్తింపు సంఘంగా తమ యూనియన్‌ పోరాటాలకు వెనకడుగు వేయదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణి ఇన్‌చార్జీ సీఎండీ ధైర్యంగా కార్మికుల సమస్యల పరిష్కా రంపై మాట్లాడలేకపోతున్నారన్నారు. గతంలో ఒప్పుకున్న ఒప్పందాలకు పరిష్కారం చూపడం లేదని, రాజకీయ ఒత్తిడికి తలొగ్గుతున్నారన్నారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వ అధిక రాజకీయ జోక్యం చేస్తుందన్నారు. సింగరేణిరి రావాల్సిన 48 వేల కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని, గనుల్లో కానీ , రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందితే కొన్ని బ్యాంకుల నుంచి ఒక కోటి రూపా యలతో పాటు 1.2 కోట్ల ఒప్పందం చేశామని, అదే విధంగా ఉద్యోగంలో కొనసాగే ఉద్యోగి అనారోగ్యంతో మరణిస్తే అతని కుటుంబానికి రూ. 25 లక్షలు వచ్చేలా చర్చలు జరుపుతున్నా మన్నారు. ఇచ్చిన హామీలు, ప్రధాన సమస్యలను పరిష్క రించడం కోసం తమయూ నియన్‌ ముందుం టుందన్నారు. సొంతింటి ఇల్లు, మారు పేర్ల మార్పు, ఇన్‌కంటాక్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే సింగరేణిలో త్వరలో సమ్మె తప్పదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గెలిచిన సంఘాన్నినిర్వీర్యం చేయాలనే విధానా లను ఎండగడతామన్నారు. ఐఎన్‌టీయూసీ యూని యన్‌ అనుసరిస్తున్న విధానాలపై పోరుబాట తప్పదన్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్‌ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, నాయకులు సోంశెట్టి రాజేశం, కంది శ్రీనివాస్‌, తిరుపతి, రాజేశ్వర్‌రావు, బానయ్య, వెంకటేశ్వర్లు, సంపత్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:25 PM