Share News

సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - May 23 , 2026 | 11:27 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 2న కెరమెరి మండలంలోని కోటారి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నితికా పంత్‌ అధికారులను ఆదేశించారు

సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం
కోటారిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ నితికా పంత్‌, అధికారులు

- ఎస్పీ నితికా పంత్‌

- పోలీస్‌ అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 2న కెరమెరి మండలంలోని కోటారి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నితికా పంత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్‌ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ ప్రాంతం, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, వీఐపీల రాకపోకలు, సభా ప్రాంగణ భద్రత, ప్రజల రద్దీ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి అధికారి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ మార్గాలను ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని, పార్కింగ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు.

సభా స్థలం లేదా ఇతర ప్రాంతాల వద్ద అనుమా నాస్పద వ్య క్తులు, వస్తువులపై నిరంతర నిఘా ఉంచాలని, భద్రతా ప్రమా ణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ అశోక్‌, సీఐలు సతీష్‌, బాలాజీ వరప్రసాద్‌, సంజయ్‌, వేణుగోపాల్‌, వామనమూర్తి, శ్రీనివాస్‌, ఎస్సైలు మధుకర్‌, మహేందర్‌, వెంకటకృష్ణ, సుబ్బారావు, సందీప్‌ పాల్గొన్నారు.

కోటారి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ

కెరమెరి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కెరమెరి మండలంలోని కోటారి గ్రామంలో ఏర్పాట్లను ఎస్పీ నితికా పంత్‌ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంబోత్సవం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. జూన్‌ 2న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కెరమెరి మండలం కోటారి గ్రామపంచా యతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమ స్థలాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్‌ స్థలాలు, రహదారుల మరమ్మతులు, తాగునీరు, విద్యుత్‌, బారికేడ్‌లు, ట్రాఫిక్‌ మళ్లింపు వంటి అంశాలపై ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీఎస్పీ అశోక్‌, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

- కొత్తగూడలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ శనివారం పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ అశోక్‌ పాటు పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులు పాల్గొన్నారు.

- టీజీఎన్పీడీసీఎల్‌ పీడీ సందర్శన..

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మండలంలోని కోఠారి గ్రామాన్ని శనివారం టీజీఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ప్రాజెక్టు మోహన్‌ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలకు డీఏ జుగా పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ మోటారు కనెక్షన్‌లు ఇవ్వాల ని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడే, డీఈఈ సుధాకర్‌, ఏడీఈ శ్రీనివాస్‌లు ఉన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:27 PM