అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:44 PM
సంక్రాంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభ వంగా నిర్వహించారు. అద్యంతం అబంరాన్నంటే లా సాగిన వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్పంచు కున్నారు.
- ఆకట్టుకున్న రంగవల్లులు, ఎడ్లబండ్ల పోటీలు
- సందడి చేసిన ప్రముఖులు
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభ వంగా నిర్వహించారు. అద్యంతం అబంరాన్నంటే లా సాగిన వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్పంచు కున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల ఎడ్లబం డి పోటీలు, రంగవల్లుల పోటీలు ఆకట్టుకున్నాయి. కోడిపందాలు జరగకుండా పోటీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బాబాపూర్ గ్రామ ఒడ్డున సర్పంచ్ సత్రవేణి రాజన్న అధ్యక్షతన ఎడ్లబండి పోటీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశా రు. న్యూరాజంపేటలో సర్పంచ్ పోచయ్య అధ్యక్షతన రంగువల్లుల పోటీలు నిర్వహించగా విజేతలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహుమతులు అందజేశారు. అం కుశాపూర్ నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, దస్నాపూరలో ఏఎంసీ చైర్మన్ మంగ, సందీప్‌నగర్‌లో సాయిరాం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి బహుమతులు ప్రదానం చేశారు. ఆసిఫా బాద్ పట్టణంలోని హోలీ ట్రినిటి ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్ష, కార్యదర్శులు ఉద యబాబు, శ్రీనివాస్ చిన్నారులకు పతంగులు పంపి ణీ చేశారు. నాయకులు విశ్వప్ర సాద్‌రావు, శ్యాం, బాలేష్‌గౌడ్, అరిగెల మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ మంగ, వాసవిక్లబ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీని వాస్, వెంకటేశ్వ ర్లు, శంకర్, శ్రీధర్, శ్రీనివాస్, శంకర్, వేణుగోపాల్, రవీందర్, ప్రశాంత్, కృపాల్, జగదీష్, నితిన్, శ్రీనివాస్, నీలేష్, అమూల్ పాల్గొన్నారు.
కాగజ్‌నగర్/బెజ్జూరు/పెంచికలపేట/వాంకిడి: కాగజ్‌నగర్ పట్టణంతో పాటు బెజ్జూరు, పెంచికల పేట, వాంకిడి మండలాల్లో ఇళ్ల ముందు వివిధ రకా లతో కూడిన ముగ్గులు వేశారు.
దహెగాం: మండల కేంద్రంలోని మార్కెట్‌లో స ర్పంచ్ జయలక్ష్మి, వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నాయకులు చందుగౌడ్, రాజు, అర్చకులు పరమేశ్వర్, మహేష్, లక్ష్మి ఉన్నారు.