Share News

‘రహ్‌వీర్‌’ ద్వారా రూ. 25వేల పారితోషికం

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:48 PM

రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను ప్రొత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ. 25వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు.

‘రహ్‌వీర్‌’ ద్వారా రూ. 25వేల పారితోషికం

ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యో తి): రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను ప్రొత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ. 25వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తం గా ప్రతీ సంవ త్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరు గుతున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌గా పరిగణి స్తారని పేర్కొన్నారు. ఈ సమయంలో బాధితు లకు సమయా నికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని తెలిపారు. కానీ కొంతమంది పౌరులు పోలీసు కేసులు ఉండవ చ్చనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారన్నారు. ఈ భయాలను తొలగిం చేందుకు కేంద్ర ప్రభుత్వం రహ్‌వీర్‌ పథకం అమలు చే స్తోందని పేర్కొన్నా రు. ఈ పథకం ప్రకా రం రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తి ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూ. 25వేల నగదు ప్రోత్సా హకంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారని వివరించారు. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాం టి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్సు సేవలకు సమాచారం ఇవ్వాలని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించా రు. ప్రతీపౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రా ణాలు కాపాడటంలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు.

Updated Date - Apr 21 , 2026 | 11:48 PM