Share News

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:31 PM

ప్రతీఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిం చాలని ఎస్పీ నితికాపంత్‌ సూచించారు. కుమరం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్పీ నితికా పంత్‌, పోలీస్‌ అధికారులు

- ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రతీఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిం చాలని ఎస్పీ నితికాపంత్‌ సూచించారు. కుమరం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతీఒక్కరు హెల్మెట్‌ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టు వినియోగించాలని తెలిపారు. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిలో యువ త అధికంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకర మని అన్నారు. ట్రిబుల్‌ రైడింగ్‌, మద్యం సేవించి, మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం, రాంగ్‌ సైడ్‌లో వాహనం నడపడం వంటి నిర్లక్ష్యం చర్యల వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయని వివరించారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. అనంత రం జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలను విద్యార్థులకు స్ర్కీన్‌పై ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ అశోక్‌, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రియదర్శి ని, సీఐలు వరప్రసాద్‌, సతీష్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:31 PM