Share News

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:17 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
జైపూర్‌లో ప్రతిజ్ఞ చేయిస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

-రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

జైపూర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జైపూర్‌ గురుకుల పాఠశాలలో నిర్వహించిన అరైవ్‌ అలైవ్‌ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ముఖ్యమని తెలిపారు. విద్యార్ధి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్‌లో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి తోడ్పడతాయన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విద్యార్థులు రోడ్డుభద్రతపై కుటుంబీకులు, బంధువులు, స్నేహితులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ప్రాముఖ్యతను వివరించి ప్రతీ ఒక్కరు సిగ్నల్స్‌ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు భధ్రతపై అవగాహన కలిగి ఉంటే సమాజానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ట్రాఫిక్‌ నియమాలపై చిత్రాలు వేశారు. సీపీ వాటిని పరిశీలించి ఉత్తమమమైన వాటికి బహుమతులు అందించారు. ట్రాఫిక్‌ నియయాలు చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ నవీన్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌, ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

హాజీపూర్‌: రోడ్డు భద్రతపై హాజీపూర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ బుధవారం పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులుగా ఉన్నప్పుడు ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డు భద్రత, హెల్మెట్‌ వాడకంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు రోడ్డు భధ్రత గురించి తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రోడ్డు భద్రత నియయాలు, జీబ్రా క్రాసింగ్‌లపై చిత్రాలు గీశారు. పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 11:17 PM