ప్రజాసమస్యలను త్వరగా పరిష్కరించండి
ABN , Publish Date - May 04 , 2026 | 11:31 PM
ప్రజా సమస్యలను త్వర గా పరిష్కరించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. సోమవా రం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగం లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యా దుదారుల సమస్యలు విని పరిష్కారానికి సంబంధిత అధికా రులకు సూచనలు ఇచ్చారు.
- ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను త్వర గా పరిష్కరించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. సోమవా రం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగం లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యా దుదారుల సమస్యలు విని పరిష్కారానికి సంబంధిత అధికా రులకు సూచనలు ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల విభాగంలో 14 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవా లని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందన్నారు.
మహిళలు, చిన్నారుల రక్షణే పోలీసుల ప్రాధాన్యం
మహిళలు, చిన్నారుల రక్షణే పోలీసుల తొలి ప్రాధాన్యం అని ఎస్పీ నితికా పంత్ అన్నారు. సోమవారం జిల్లా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశం లో ఆమె మాట్లాడారు. గత ఏప్రిల్ నెలలో షీ టీం ద్వారా 35 అవగాహన కార్యక్రమాలు, 13 ఫిర్యాదు లు స్వీకరించినట్లు తెలిపా రు. షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భరోసా కేంద్రా ల ద్వారా మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, ఫోక్సో వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేధింపులకు గురైతే వెంటనే షీ టీంలను సంప్రదించాలని ఆసిఫాబాద్(8712670564), కాగజ్‌నగర్ (8712670565) నంబర్లను సంప్రదించాలన్నారు.