Share News

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - May 19 , 2026 | 12:23 AM

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

- అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ భవన సముదాయంలోని సమావేశ మం దిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మానికి రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వాణి కార్యక్రమంలో వచ్చే ప్రతి దరఖాస్తును సంబం ధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రజావాణిలో అందిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. అనంతరం దరఖాస్తుదారు ల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్‌ మండ లం రహపల్లి గ్రామానికి చెందిన మొండయ్య తనకు సెంట్రింగ్‌ మేస్త్రీ పనుల పరికరాలు కొనుగోలు కోసం పీఎంజీపీ రుణం ఇప్పించాలని అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం గోలేటికి చెందిన స్వప్న గ్రామ శివారులో ఉన్న సాగు భూమికి నీటి సౌకర్యం కల్పిం చడం కోసం మోటారు పంపు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కౌటాల మండల కేంద్రానికి చెందిన జ్ఞానేశ్వర్‌ మొగడ్‌దగడ్‌ క్రాస్‌ రోడ్డు వద్ద డ్రైనేజీ నిర్మించాలని అర్జీ అందజేశారు.

లింగాపూర్‌ మండలం మోతిపటార్‌ గ్రామానికి చెందిన లలిత ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు అట వీ అనుమతులు ఇప్పించాలని కోరారు. రెబ్బెన మండ లం నవేగాం గ్రామానికి చెందిన శంకర్‌ తనకు దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని, రెబ్బెన మండలం గోలేటికి చెందిన రజిత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. జిల్లా కేం ద్రానికి చెందిన ఎండీ జమీల్‌ హుస్సేన్‌ తనకు స్వతం త్య్ర సమరమోధుల సర్టిఫికేట్‌ మంజూరు చేయాలని, జైనూరు మండలం దబోలికి చెందిన మీరాబాయి తనకు రెండో విడత ఇందిమ్మ ఇల్లు మంజూరు చే యాలని దరఖాస్తు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:23 AM