ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - May 04 , 2026 | 11:29 PM
ప్రజావాణిలో వచ్చే ప్రతీ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అధికారుల కు సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, డేవిడ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
- కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చే ప్రతీ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అధికారుల కు సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మాట్, డేవిడ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అన్నారు. గత ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించా లన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఇళ్ల గణనలో భాగంగా స్వీయ గణన మే 10 లోగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తులను స్వీకరించారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో రహదా రిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు నారాయణ దరఖాస్తు అందజేశారు.
చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన అమృత తమ పట్టా భూమిలో ఇతరులు బలవంతగా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మారు తినగర్‌కు చెందిన స్వాతి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, బెజ్జూరు మండలం ఎల్కపల్లికి చెందిన రాజేశ్వరి తన పేరు ఇందిర మ్మ ఇల్లు మొదటి జాబితాలో ఉన్నా మంజూరు కాలేదని మంజూరు చేయాలని అర్జీ సమర్పించా రు. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన పూజిత తన పేరున లిస్టు-3 నుంచి లిస్టు 1కి మార్చుట గురించి దరఖాస్తు చేసుకున్నారు.
పెంచికలపేట మండలం పోతెపల్లి గ్రామానికి చెంది న గ్రామస్తులు తమ గ్రామ శివారులో సర్వే నంబర్ 190, 191 రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించాలని దరఖా స్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామా నికి చెందిన భాస్కర్ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూ రు చేయాలని, చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన శంకర్ తన పట్టా భూమి లో ఇతరుల పేర్లు నమోదు అయినందు తొలగిం చాల ని దరఖాస్తు చేసుకున్నారు.