ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:06 PM
ప్రజావాణిల వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరిం చాలని అదనపు కల్టెర్ డేవిడ్ సంబంధిత అధికారులకు సూచించారు.
- అదనపు కలెక్టర్ డేవిడ్
ఆసిఫాబాద్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిల వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరిం చాలని అదనపు కల్టెర్ డేవిడ్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్ట ర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన సునంద తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయా లని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మం డలం చోర్‌పల్లి గ్రామానికి చెందిన విజయ తన భర్త మరణించినందున వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, రెబ్బెన మండలం వం కులం గ్రామానికి చెందిన శంకర్ తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం గోలేటికి చెందిన రోహి దాస్ తనకు వ్యవసా య భూమిలో ఒపెన్ కాస్టులో ముంపునకు గురవుతున్నందున నష్టపరిహారం చెల్లించా లని కోరారు. తిర్యాణి మండలం గంభీరావు పేట గ్రామానికి చెంది న చిన్నమ్మ తన పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిం చాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం నారాయణపూర్‌కు చెందిన అరుణ, కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన లక్ష్మి తమకు ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.