ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:21 AM
ఆదివాసి గిరిజన ఆరాధ్య దైవమైన పద్మల్‌పురి కాకో ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతామ ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
దండేపల్లి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆదివాసి గిరిజన ఆరాధ్య దైవమైన పద్మల్‌పురి కాకో ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతామ ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం దండేపల్లి మండలం గుడిరేవు పద్మల్ పురీ కాకో అమ్మవారిని ఆయన దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో ఆ యన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల సం క్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలోనే ప్ర త్యేక గుర్తింపుతో గౌరవం ఉందన్నారు. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాల ను కాపాడుతూ వాటిని పాటించడంలో ఆదివాసిలు ప్రత్యేకంగా నిలుస్తా రన్నారు. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది ఆదివాసి గిరిజ నులేనని, ఆదివాసిలు సంస్కతీ సంప్రదాయాలు ఎంతో గోప్పవన్నారు. దం డారీ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ఆదివాసి భక్తులు కుటుంబసమేతంగా గుడిరేవు గిరిజన ఆలయానికి తరలివస్తారన్నారు. అందుకు అనుగుణగా వారికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయం వద్ద మౌలిక సదుపా యాలు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. ఆలయ అభివృద్దితో పా టు భక్తుల సౌకర్యాల కోసం ఆలయ కమిటీ సభ్యులు అధికారులు సమన్వ యంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటి ఛైర్మన్ కోమురం ఆనంత్‌రావు, మాజీ సర్పంచ్ మంజుబార్గవి నిర్వహకు లు రమేష్, సోము, లింగారావు, శ్రీనివాస్, జంగు, సంతోష్, కృష్ణరాజు పాల్గొన్నారు.
,