Share News

‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:40 PM

ప్రజాసమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో అందిన దరఖాస్తుల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కె హరిత

- కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మార్చి 2 (ఆంధ్ర జ్యోతి): ప్రజాసమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో అందిన దరఖాస్తుల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలి సి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. జిల్లాలోని పెంచికలపేట జీపీ సర్పం చ్‌ పోశన్న తమ గ్రామంలో నిర్మిస్తున్న పం చాయతీ భవన నిర్మాణ పనులు నాసిరకంగా చేస్తున్నారని, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్‌ మండలం జెండాగూడ గ్రామాని కి చెందిన సోంబాయి తనకు ఇప్పలనవేగాం గ్రామంలో పట్టా భూమిని తన పేరిట చే యాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెజ్జూ రు మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన పక్కీరు తన తండ్రి మరణించినందున ఆయన పేరిట గల భూముల ను తన పేరిట విరాసత్‌ చే యాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కాగజ్‌నగర్‌ మండలం గ్రా మానికి చెందిన రాజేష్‌, ఆసి ఫాబాద్‌ పట్టణానికి చెందిన కల్పనలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేర్వేరుగా అర్జీలు సమర్పిం చారు. ఈ సందర్భంగా కలెక్ట ర్‌ మాట్లాడుతూ ప్రజావాణి లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. సీపీఆర్‌ఓతో సీఎం వచ్చే రిజండర్లపై 48 గంటల్లో నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు.

శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిద్దాం

రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిం చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయాలను కొనసా గిద్దామని కలెక్టర్‌ హరిత అన్నారు. సోమవారం శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంల ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా రాష్ట్రానికి ఎనలేని సేవలందించారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, ఏవో కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 11:40 PM